Surprise Me!

Ravi Shastri appointed As Team India Coach | Oneindia Telugu

2017-07-11 0 Dailymotion

Ravi Shastri appointed next coach of Team India. <br />భారత క్రికెట్‌ కోచ్‌ ఎంపిక డ్రామాకు మంగళవారం తెరపడింది. కోచ్‌ ఎంపికలో అనూహ్యం ఏమీ జరగలేదు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించింది. గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్థతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా నియమించింది. రవిశాస్త్రి కోచ్ పదవి రేసులోకి వచ్చిన మరుక్షణమే విరాట్ కోహ్లి కొత్త గురువు అనే దానికి దాదాపు సమాధానం దొరికినప్పటికీ, తాజాగా దానికి ఫుల్ స్టాప్ పడింది.దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బీసీసీఐ హడావిడి చేసినా... రవిశాస్త్రి అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది.

Buy Now on CodeCanyon